Monday, December 23, 2024

ప్రభాస్ చేతుల మీదుగా “కళ్యాణం కమనీయం”

- Advertisement -
- Advertisement -

యువ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”. ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే అనే పాటను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ పాటలో మరో స్టార్ హీరో శర్వానంద్ కనిపించడం
విశేషం.

సింగిల్ లైఫ్ గొప్పదని చెప్పుకునే యువత..రేపు మిడిల్ ఏజ్ వచ్చాక ఏ తోడు లేకుండా పోతుందనే విషయాన్ని ఆలోచించడం లేదని…లైఫ్ లో పెళ్లి చాలా ముఖ్యమని ఈ పాట ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించి పాడారు. పెళ్లయ్యాక శృతితో శివ పడుతున్న కష్టాలు చూసిన శర్వానంద్..మ్యారేజ్ చేసుకున్నాక ఇలా ఉంటుందా అని భయపడుతుంటాడు. ఈ పాట చూపించాక అతనిలో ఓ ఛేంజ్ కనిపిస్తుంది. వెంటనే ప్రభాస్ అన్నా అంటూ ఫోన్ చేసి..ఆయన వెడ్డింగ్ గురించి ఆయన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సరదాగా ఉన్న ఈ పాటకి
కాన్సెప్ట్ మరియు దర్శకత్వం అనిల్ చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News