Thursday, January 23, 2025

ప్రభాస్ డబుల్ యాక్షన్

- Advertisement -
- Advertisement -

Prabhas praises maha samudram trailer

సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చేస్తున్న ప్రభాస్… దర్శకుడు మారుతితో ఒక సినిమా చేస్తున్నారు. టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అంశం తెలిసింది. ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. హారర్ కామెడీ నేపథ్యంలో మారుతీ దీన్ని తీర్చిదిద్దనున్నారు. తాత-మనవళ్లుగా రెండు పాత్రల్లోనూ ప్రభాస్‌సే నటించనున్నారని సమాచారం. ఈ కథ కూడా తాత-మనవళ్లు మధ్య జరుగుతుందట. డబుల్ యాక్షన్‌లో ప్రభాస్‌కి మంచి ట్రాక్ రికార్డ్ వుంది. బిల్లా, బాహుబలి చిత్రాల్లో డబుల్ యాక్షన్‌లో కనిపించారు. ఈ రెండూ పెద్ద విజయాలే. ఇప్పుడు మారుతి సినిమాలో కూడా డబుల్ యాక్షన్ కావడం విశేషం. అలాగే ఇందులో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్‌పైైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సూపర్ డీలక్స్ అనే టైటిల్ పరిశీలనలో వుంది.

Prabhas to play double role in Maruthi’s Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News