Thursday, December 26, 2024

గోపీచంద్ పాత్రకు ప్రభాస్ వాయిస్ ఓవర్

- Advertisement -
- Advertisement -

యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త చిత్రం ‘విశ్వం’పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను ప్రభాస్ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారు. సినిమాలో గోపీచంద్ పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ను ప్రభాస్ చెప్పబోతున్నాడని టాక్. పైగా ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది. గోపీ చంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. అందుకే, ప్రభాస్ ‘విశ్వం’ సినిమా కోసం తన వాయిస్ ను వినిపించబోతు న్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల్లో ‘విశ్వం’ సినిమాకి మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోండగా.. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News