ప్రభాస్ సినిమాలకు ఒకప్పుడు హారిస్ జైరాజ్, తమన్, దేవిశ్రీప్రసాద్, కీరవాణి, మణిశర్మ, జీవి ప్రకాష్ కుమార్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించేవారు. ఇప్పుడు ప్రభాస్ నేషనల్ లెవల్ స్టార్ అయ్యాడు. దాంతో ఏ.ఆర్.రెహ్మాన్, అనిరుధ్ రవిచందర్, శంకర్ ఇషాన్ లాయ్, అమిత్ త్రివేది వంటి బడా సంగీత దర్శకులు ఆయన సినిమాలకు మ్యూజిక్ అందిస్తారని అందరూ భావించారు. కానీ ప్రభాస్ ప్రస్తుతం యువ సంగీత దర్శకులనే తన సినిమాలకు తీసుకుంటున్నాడు. ‘రాధే శ్యామ్’ సినిమాకి తెలుగులో జస్టిన్ ప్రభాకరన్ (డియర్ కామ్రేడ్) సంగీతం అందిస్తున్నాడు. హిందీ వర్షన్‌కి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ సినిమాకి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రుర్ పని చేస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న నాగ్‌అశ్విన్ చిత్రానికి మిక్కీ జె. మేయర్ పాటలు సమకూర్చుతాడు. లేటెస్ట్‌గా ఓం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాకి సాచెత్, – పరంపర అనే యువ సంగీత దర్శకులు ఖరారు అయ్యారట. ఇంతకుముందు ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంలోని ‘సైకో సైయా’ అనే పాటకి స్వరాలు కూర్చింది వీరే. ఇలా మొత్తం తన సినిమాలన్నింటికీ వరుస పెట్టి వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్లలతోనే వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. దర్శకుల విషయంలో కూడా ఆయన పంథా డిఫెరెంట్‌గా ఉంది.
యువ సంగీత దర్శకులతో పనిచేస్తూ…
- Advertisement -
- Advertisement -
- Advertisement -