Thursday, January 23, 2025

వీడియో వైరల్: వందమందితో ప్రభుదేవా ‘నాటునాటు’ స్టెప్పులు

- Advertisement -
- Advertisement -

ఆస్కార్‌ గెలుచుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి యావత్‌ ప్రపంచాన్ని షేక్‌ చేసిన ‘నాటు నాటు’ పాటను అందరూ అభినందిస్తున్నారు. నాటు నాటు స్వరకర్త ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ తో పాటు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కూడా గ్రాండ్ విషెస్ తెలియజేశాడు. ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ఆర్‌సి 15 సినిమా కోసం ఒక పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు.

నెక్స్ట్ షెడ్యూల్‌లో, 100 మందికి పైగా డ్యాన్సర్‌లతో చరణ్, కియారాలపై ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే RRR సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. అయితే ఇప్పటికీ ఆ సినిమా సృష్టించిన మేనియా నుంచి ఎవరు బయటకు రాలేకపోతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అవ్వడమే కాకుండా ఆస్కార్ అవార్డును అందుకొని చరిత్ర సృష్టించింది. కాగా స్టూడియాలో 100 మంది డ్యాన్సర్లతో కలిసి ప్రభుదేవా నాటు నాటు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఆయన టీమ్ తో వేసిన నాటు నాటు స్టెప్పులు సోషల్ వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News