బెంగళూరు: మెజిస్టిక్ ప్రాంతంలోని నాడ ప్రభు కెంపేగౌడ భూగర్భ మెట్రో స్టేషన్‌లో ఓ ప్రేమ జంట అసభ్యంగా ప్రవర్తించింది. ప్రేమజంట హద్దులమీరి ముద్దుల వర్షం కురిపించడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాధవరం మెట్రో స్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫామ్‌లో గురువారం సాయంత్ర ప్రేమజంట ముద్దుల వర్షం కురిపించింది. వారు చుంబనాలు చేస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రేమ జంట స్రీకేట్ ప్లేస్‌లో విపరీత స్పందనలు చేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. యువతులు, బాలబాలికలు చూస్తుండగానే ప్రేమజంట సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎంఆర్‌సిఎల్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పబ్లిక్ ప్రేమజంట వికృత చర్యలు బాగోలేవని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల ప్రభావం యువతిపై ఎక్కువగా ఉండడంతో ఇలా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.