Monday, December 23, 2024

అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం నిత్యం యోగ అభ్యాసం

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 21న తెలంగాణ యోగాసన స్పోర్ట్ అసోసియేషన్ సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలో పలు చోట్ల యోగ అభ్యాసం చేస్తున్నారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్ అసోసియేషన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎలిగేటి కృష్ణ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు యోగ కేంద్రంలో, నెహృనగర్, సుభాస్‌నగర్, శివనగర్, విద్యానగర్, శాంతినగర్, పత్తిపాక వీధి, రెడ్డివాడ, బివైనగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాలో నిత్య యోగ అభ్యాసం చేస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ యోగాసన స్పోర్ట్ అసోసియేషన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎలిగేటి కృష్ణ మంగళవారం యోగ అభ్యాసం తరువాత మాట్లాడుతూ ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవానిన పురస్కరించుకుని ఈ నెల 16 నుంటి ఐదు రోజులు యోగ ప్రదర్వనలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 21వరకు సిరిసిల్ల బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగా ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగాపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ పాల్గొనవచ్చన్నారు.

యోగ వల్ల మధుమేహం (షుగర్),ఊబకాయం( ఒబెసిటి) తదితర వ్యాధుల తగ్గేందుకు చేయాల్సిన ప్రాణాయామం, యోగాసనాలు ప్రతి రోజు అభ్యాసం చేయిస్తున్నామన్నారు. ఈ నెల 21న నిర్వమించే అంతర్జాతీయ యోగ దినోత్సవం కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగాసన స్పోర్ట్ అసోసియేషన్ సిరిసిల్ల జిల్లా ప్రతినిధులు చిలుక వేణు కిరణ్, పత్తిపాక సురేష్, కూరపాటి శ్రీధర్, బల్ల శ్రీకాంత్, నాగుల కనుకయ్య, చిటికెన శ్రీనివాస్, దూస రమేష్, అల్వాల్ అశోక్, లాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News