Wednesday, January 22, 2025

పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించిన ప్రదీప్…

- Advertisement -
- Advertisement -

పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించిన ప్రదీప్…
అభినందించిన రాచకొండ సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, సిటిబ్యూరో: నగరంలోని నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన ఎఎఓను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సిపి మహేష్ భగవత్‌ను సోమవారం ఆయన కలిశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రదీప్‌కుమార్ హైదరాబాద్, గన్‌ఫౌండ్రీలో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్‌లో 83కిలోల విభాగంలో 390 కిలోల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. కార్యక్రమంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనిల్, వెంకటేశ్వర్లు, సీనియర్ అకౌంటెంట్ అభినవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News