Monday, December 23, 2024

ప్రాథమిక హక్కులు

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరిచారు.
ప్రాథమిక అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం.
ఆర్టికల్ 12 35 నిబంధనలు ప్రాథమిక హక్కుల గురించి పేర్కొంటున్నవి.
1215లో ఇంగ్లండ్ రాజు కింగ్ జాన్ ఎడ్వర్ట్ ప్రపంచంలో తొలిసారిగా ప్రాథమిక హక్కుల గురించి పేర్కొన్నారు.
జాన్ ఎడ్వర్ట్ తొలిసారిగా ప్రజలకు హక్కులు ఇవ్వడం కోసం హక్కుల పత్రాన్ని జారీ చేశారు.
ఈ హక్కుల పత్రాన్ని మాగ్నా కార్టా అని అంటారు.
మాగ్నా కార్టా అంటే రాజుకు ప్రజలకు మధ్యజరిగిన ఒప్పందం అని అర్థం.
అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ పేరుతో ప్రాథమిక హక్కులు పొందు పరిచారు.
ప్రపంచంలో తొలిసారిగా ప్రాథమిక హక్కులు పొందుపరిచిన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం.
1948, డిసెంబరు 10న యూఎన్‌ఓ మానవ హక్కుల ప్రకటన చేసింది.

Election schedule released for 57 Rajya Sabha seats

భారతదేశంలో ప్రాథమిక హక్కులు
కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో అనిబిసెంట్ తొలిసారిగా ప్రాథమిక హక్కుల గూర్చి పేర్కొంది.
1931లో కరాచీ ఐఎన్‌సి సమావేశంలో తొలిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక హక్కులను ప్రస్తావించింది.
యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ ప్రాథమిక గురించి పేర్కొన్నారు.
మోతిలాల్ నెహ్రూ తన నివేదికలో ప్రాథమిక హక్కుల గూర్చి పేర్కొన్నారు.
రాజ్యాంగ పరిషత్‌లో ప్రాథమిక కమిటీకి అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ
ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఉపాధ్యక్షుడు జెబి కృపలాని.
ప్రాథమిక హక్కులకు న్యాయ సమీక్షాధికారం వర్తిస్తుంది.
ప్రాథమిక హక్కులను కోరుకునేది ప్రజలు.
హక్కులను అమలు చేసేది ప్రభుత్వం.
ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత న్యాయస్థానాలు.
సవరణ/మార్పులు/తొలగింపు చేసే అధికారం పార్లమెంట్‌ది (2/3 మెజారిటీ)
వీటిని తాత్కాలిక నిలుపుదల చేసే అధికారం రాష్ట్రపతిది (ఆర్టికల్ 20,21 తప్ప)
ప్రాథమిక హక్కులు రకాలు
1. సమానత్వపు హక్కు (14 18)
2. స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కు (1922)
3. పీడన నిరోధించే హక్కు (2324)
4. మత స్వాతంత్య్రపు హక్కు (2528)
5. విద్యా సాంస్కృతిక హక్కు (2930)
6. రాజ్యాంగ పరిహార హక్కు (32 ఆర్టికల్)

నోట్: ప్రారంభంలో 7 హక్కులు ఉండేవి. ఆస్తిహక్కు (31)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి, 12వ భాగంలోని 300(A)నిబంధనలో చట్టబద్ధమైన హక్కుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి.

ఆర్టికల్ 12
రాజ్యం గురించి నిర్వచిస్తుంది.
హక్కులను అమలు చేసేది రాజ్యం.
1. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
2. కేంద్ర రాష్ట్ర చట్టసభలు
3. స్థానిక సంస్థలు
4. ఇతర సంస్థలు
నోట్: ఇతర సంస్థలు కిందకు వచ్చేవి ఏవో..రానివి ఏవో కోర్టులు నిర్ణయిస్తాయి.
రాజ్యం కిందికి రానివి
బిసిసిఐ, ఎన్‌సిఆర్‌టి, ట్రస్ట్‌లు, సహకార సంఘాలు.
నోట్: న్యాయవ్యవస్థ తీర్పులు చెప్పేటప్పుడు రాజ్యం కిందకు రాదు. కాని కోర్టు తన సిబ్బందిని నియమించుకునేటప్పుడు కార్యనిర్వహణ విధులు నిర్వర్తిస్తుంది. అప్పుడు రాజ్యంగా పరిగణించబడుతుంది.
సమానత్వపు హక్కులు (14-18):
ఆర్టికల్ 14: చట్టం ముందు అందరూ సమానులే
ఆర్టికల్ 15: కేవలం జాతి, కుల, మత, లింగ, జన్మస్థలం ఆధారంగా వివక్షతలు పాటించరాదు.
ఆర్టికల్ 16: జాతి, కుల, మత, లింగ, జన్మస్థలం, వంశపారంపర్యం, నివాసం ఆధారంగా సామాజిక అవకాశాలలో వివక్షత పాటించరాదు.
ఆర్టికల్ 17: అస్పృశ్యత/అంటరానితనం నిషేధం.
ఆర్టికల్ 18: బిరుదులు నిషేధం
చట్టం ముందు అందరూ సమానులే (ఆర్టికల్ 14)
ఇది రెండు రకాలు
1. చట్టం ముందు అందరూ సమానులే
ఈ భావన బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది.
ఇది సమన్యాయాన్ని సూచిస్తుంది.
2. చట్టం మూలంగా సమానత్వం
ఈ భావనను అమెరికా నుంచి స్వీకరించారు.
సమాన హోదా కలిగిన వ్యక్తులలో ఒక రకమైన చట్టాలు, అసమాన హోదా కలిగిన వ్యక్తుల్లో ఒక రకమైన చట్టాలు అమలు చేయవచ్చు.
కాని ఈ వర్గీకరణ లక్షం సమానత్వమై ఉండాలి. ( హేదుబద్ధత కలిగిన వర్గీకరణని అనుమతిస్తుంది)
మినహాయింపులు
ఆర్టికల్ 361: రాష్ట్రపతి, గవర్నర్‌లపైన క్రిమినల్ కేసు వేయరాదు. సివిల్ కేసు వేయాలంటే రెండు నెలల ముందు నోటీసు ఇవ్వాలి.
పన్ను చెల్లింపు నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయించారు.
ఆర్టికల్ 15: కేవలం జాతి, కుల, మత, లింగ, జన్మస్థలం ఆధారంగా పౌరులపై వివక్ష పాటించరాదు.
15(4): విద్య పరంగా వెనుకబడ్డ వారికి ప్రభుత్వం ప్రత్యేక మినహాయంపు కల్పించవచ్చు. (1వ సవరణ)15(5): ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు విద్యాలయాల్లో ప్రవేశానికి ప్రత్యేక మినహాయింపు ఇవ్వొచ్చు. (93వ సవరణ)
16(3): వెనుకబడిన కొన్ని ప్రాంతాలకు పత్యేక మినహాయింపులుంటాయి.

 

స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు (19-22)

16(4): సామాజిక పరంగా విద్య పరంగా ఎస్సీ, ఎస్టీ, ఒబిసి..వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపులు కల్పించవచ్చు.
16(4a): ఎస్సీ, ఎస్టీ వర్గంకు ప్రమోషన్లలో కూడారిజర్వేషన్లు కల్పించవచ్చు. (77వ రాజ్యాంగ సవరణ).
ఆర్టికల్ 17: అస్పృశ్యత నిషేధం
దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం 1955 అస్పృశ్యత నేర చట్టం చేసింది. దీనినే 1976లో పౌరహక్కుల చట్టంగా మార్చారు.
నోట్: అస్పృశ్యత అను పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మైసూర్ కోర్టు తీర్పు ఆధారంగా చట్టం పేరు మార్చారు.
ఆర్టికల్ 18: బిరుదులు నిషేధం
అప్పట్లో బ్రిటీష్ వారు ఇచ్చిన రాజ్‌బహదూర్..వంటి అన్ని రకాలబిరుదులు నిషేధం.
మినహాయింపులు: విద్య, సైనిక సంబంధమైన పురస్కారాలు. పేర్ల ముందు ధరించవచ్చు.
భారత దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు వంటి వాటికి మినహాయింపులు ఉంటాయి.
అయితే పద్మ అవార్డులను బిరుదులుగా వాడరాదని కోర్టు తీర్పులు ఇచ్చింది.
విదేశాలు ఇచ్చే బిరుదులు రాష్ట్రపతి అనుమతి లేకుండా తీసుకోరాదు.
పత్రికా స్వేచ్ఛ
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1a) భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది.
పత్రికా స్వేచ్ఛ పరోక్షంగా దీని కిందకు వస్తుంది.
బ్రిటిష్ కాలంలో లార్డ్ లిట్టన్ ప్రాంతీయ భాష చట్టంను తీసుకొచ్చాడు.
ఆ చట్టంలో పత్రికలు కేవలం ఇంగ్లిషు భాషలోనే ముంద్రించాలనే నిబంధనలున్నాయి.
దీనిని లార్డ్ రిప్పన్ రద్దు చేశారు.
ఇండియాలో పత్రికా స్వేచ్ఛ కల్పించింది లార్డ్ మెట్ కాఫ్.
పత్రికలతో పాటు కార్టూన్స్, సినిమాలు, డాక్యూమెంట్స్, సోషల్ మీడియా వంటివి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయి.

 

ఆర్టికల్ 19: స్వేచ్ఛాహక్కు (ఆరు రకాల స్వేచ్ఛలు)
ఆర్టికల్ 20: శిక్ష నుండి రక్షణ పొందే హక్కు:
ఆర్టికల్ 21: జీవించే హక్కు
ఆర్టికల్ 22: అరెస్టు నుండి రక్షణ పొందే హక్కు

ఆర్టికల్ 19-ఆరు రకాల స్వేచ్ఛలు ఇవే
19(1a): వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ
19(1b): శాంతి యుతంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు. (ఆయుధాలు లేకుండా)
19(1c): సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
19(1d): దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ
19(1e): దేశ వ్యాప్తంగా ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు.
19(1g): ఇష్టం వచ్చిన వృత్తి (లేదా)వ్యాపారం నిర్వహించవచ్చు.

నోట్: 19(1f) ఈ నిబంధన పౌరులు ఆస్తిని సంపాదించడం, ఖర్చు చేయడం గురించి పేర్కొంటుంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 19(1f)ని తొలగించారు.

డా.బిఎస్‌ఎన్ దుర్గాప్రసాద్, డైరెక్టర్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News