Friday, November 22, 2024

సిద్దిపేట పట్టణంలో ప్రత్యేక సర్వే

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ప్రదాన మంత్రి ఆవాసన్ యోజన పథకంలో బాగంగా బీఎల్‌సీ లబ్ధిదారుల ఎంపిక పట్టణంలో ఆదివారం ప్రత్యేక సర్వే నిర్వహించడం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు తెలిపారు. ఆదివారం హెచ్‌యూడీసీఓ బృందం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ… లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గడిచిన కాలంలో సిద్దిపేట పట్టణంలో ప్రత్యేక సర్వేను చేపట్టడం జరిగిందన్నారు.

అనంతరం రాష్ట్రప్రభుత్వానికి సిద్దిపేట పురపాలక సంఘం ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని 2,3,11,16,31,32,33 34,36,37 ,వార్డులలో నేరుగా లబ్ధిదారుల గృహలకు వెళ్లి వారి గృహాలను పరిశీలించారు. అంతకు ముందు హెచ్‌యూడీజీఓ సభ్యులకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, చైర్మన్ మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజులు కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్ వంగ రేణుక తిరుమల్ రెడ్డి, నాయిని చంద్రం, దాసరి బాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News