Thursday, January 23, 2025

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నగదు జమా

- Advertisement -
- Advertisement -

 

Kisan samman Money

సిమ్లా: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎం కిసాన్) పథకంలో భాగంగా 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరీబ్‌ కళ్యాణ్‌ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ సిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు.  సిమ్లాలోని రిడ్గే మైదానంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న 16 పథకాల పని తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని స్వయంగా కొందరు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

పిఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 (రూ. 2 వేలు చొప్పున మూడు దఫాలుగా) అందిస్తోంది. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్‌స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ఇవాళ 11వ విడత డబ్బులు జమా చేశారు. దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పిఎం సమ్మాన్‌ నిధి నుంచి రూ.21 వేల కోట్ల రూపాయలను మోడీ విడుదల చేశారు.

అయితే ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ పథకం ద్వారా.. దేశంలోని రైతులందరికీ గ్రాంట్లు అందవు. PM కిసాన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ముందుగానే రిజిస్టర్‌ అయ్యి ఉండాలి. అలాగే చిన్న,  సన్నకారు రైతులు ప్రయోజనాలను పొందుతారు. కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి.

చెక్ చేసుకునేదెలా?
  • https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్‌ను క్లిక్‌ చేయాలి.
  • కుడి వైపు ఆప్షన్స్‌లో బెనిఫీషియరీ(లబ్దిదారుడు) స్టేటస్‌ ఉంటుంది.
  • అక్కడ ఆధార్‌, అకౌంట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి గెట్‌ డేటాపై క్లిక్‌ చేయాలి
  • పిఎం కిసాన్‌కు రిజిస్టర్‌ చేసుకుని.. ఈ-కేవైసీ పూర్తి అయ్యి ఉంటేనే  ఖాతాలోకి డబ్బు జమా అవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News