Thursday, January 23, 2025

19 మందికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి బాల పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వివిధ రాష్ట్రాలకు చెందిన 19 మందిని ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు. కళలు, సాంస్కృతిక విభాగంలో తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ, క్రీడా విభాగంలో ఆంధ్రప్రదేశ్‌నుంచి ఆర్ సూర్య ప్రకాశ్ ఈ అవార్డుకు ఎంపికయిన వారిలో ఉన్నారు.

మహారాష్ట్రకు చెందిన ఆదిత్య విజయ్ బ్రాహ్మణేకు సాహస విభాగంలో మరణానంతరం ఈ అవార్డు దక్కింది. మొత్తం19 మందిలో తొమ్మిది మంది బాలురు, పదిమంది బాలికలు ఉన్నారు. ఈ నెల 22న విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేస్తారు. ఆ మరుసటి రోజు ప్రధాని నరేంద్ర మోడీ అవార్డు గ్రహీతలతో ముచ్చటిస్తారు. అలాగే ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో సైతం వీరు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News