Wednesday, January 22, 2025

దేశ ప్రధానుల విశేష మ్యూజియం

- Advertisement -
- Advertisement -

Pradhan Mantri Sangrahalaya to Open on April 14

14న ప్రధాని మోడీతో ప్రారంభం

న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రధాన మంత్రి సంగ్రహాలయ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. దేశానికి ఇప్పటివరకూ వచ్చిన ప్రధాన మంత్రులందరి పనితీరు, వారి అభిరుచులను ఈ మ్యూజియంలో పొందుపరుస్తారు. దేశానికి అంకితం చేసే ఈ కేంద్రం ద్వారా ప్రజలకు దేశ ప్రధానుల విశిష్ట నాయకత్వం వారి ఆలోచనా విధానాల గురించి జాతికి తెలియచేయడం జరుగుతుంది. భావితరాలకు ఇది ఓ విజ్ఞాన కేంద్రం అవుతుంది. ఎప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ సంగ్రహాలయను ఆరంభిస్తారు. తీన్ మూర్తి ఎస్టేట్ వద్ద దీనిని నిర్మించారు. దేశ స్వాతంత్య ఉద్యమం తరువాతి క్రమంలో స్వాతంత్రం రావడం, ప్రగతిదిశలో పయనం వంటి ఘట్టాలు కూడా ఇందులో ఉంటాయి. దేశ సారధ్య బాధ్యతలన్ని ప్రధాని కార్యదక్షతపైనే ఆధారపడి ఉంటాయి. ఈ దిశలో మన పూర్వపు ప్రధానుల విజన్ వారి నాయకత్వాన్ని దర్ఫణం మాదిరిగా ఈ మ్యూజియం చూపిస్తుంది. ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వాస్తవికత ప్రాతిపదికన ఈ మ్యూజియంలో ప్రధానుల అనుభవాలను సేవలను తెలియచేస్తారని ప్రభుత్వం వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News