Tuesday, December 24, 2024

కార్ల్‌సన్‌-ప్రజ్ఞానంద రెండో గేమ్ డ్రా

- Advertisement -
- Advertisement -

కార్ల్‌సన్‌ప్రజ్ఞానంద రెండో గేమ్ డ్రా
నేడు టైబ్రేకర్ ద్వారా తేలనున్న విజేత
బాకు(అజర్‌బైజాన్): ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా భారత యువ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, నార్వే గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ల మధ్య బుధవారం జరిగిన రెండో రౌండ్ డ్రాగా ముగిసింది. ఇంతకుముందు తొలి రౌండ్ కూడా డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఇక రెండో రౌండ్‌లో ప్రజ్ఞానందకార్ల్‌సన్‌లు 30 ఎత్తుల తర్వాత డ్రాకు అంగీకరించారు. దీంతో గురువారం టైబ్రేకర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. భారత టీనేజి సంచలనం ప్రజ్ఞానంద ఈ ప్రపంచకప్‌లో అసాధారణ ఆటతో అలరిస్తున్నాడు.

ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సెమీ ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిగా పేరున్న ఫాబియానో కరువాపై సంచలన విజయం సాధించాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ చెస్‌లో ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా 18 ఏళ్ల తమిళనాడు యువ కెరటం ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News