Monday, December 23, 2024

ప్రపంచకప్ చెస్ ఫైనల్లో ప్రజ్ఞానంద

- Advertisement -
- Advertisement -

బాకు: భారత యువ చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరుగుతున్న చెస్ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన సెమీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఆటగాడు ఫాబియానో కరువానాను ఓడించాడు. ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు కరువానాతో జరిగి న పోరులో ప్రజ్ఞానంద అసాధారణ ఆటను కనబరిచాడు. సంచలన విజయంతో టైటిల్ పోరు అర్హత సాధించాడు. ఈ క్రమంలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌తో ప్రజ్ఞానంద తలపడుతాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News