Wednesday, January 22, 2025

యూనివర్సిటీ విద్యార్థి కాల్పులు: 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ప్రాగ్: చార్లెస్ యూనివర్సిటీ విద్యార్థి  జరిపిన కాల్పుల్లో 16 మంది మరణించిన సంఘటన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జాన్ పాలహ్ కూడలి సమీపంలో సమూహంపై యూనివర్సిటీ విద్యార్థి కాల్పులు జరపడంతో 16 మంది దుర్మరణం చెందగా 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాల్పులు జరుపుతున్నప్పుడు పర్యాటకులు భయంలో వణికిపోయారు. ఘటనా స్థలం నుంచి జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోయారు. చార్లెస్ యూనివర్సిటీని వీక్షించడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News