Monday, April 21, 2025

మిమ్మల్ని క్షమించబోను

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికలకు తనకు అభ్యర్థిత్వం ఇవ్వరాదన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయానికి భోపాల్ బిజెపి ఎంపి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ స్పందించారు. నాథూరామ్ గాడ్సేను కొనియాడుతూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడి ఉండకపోవచ్చునని ఆమె సూచించారు. తనను ‘క్షమించబోను’ అని మోడీ సూచనప్రాయంగా చెప్పినట్లు ప్రజ్ఞా సింగ్ తెలిపారు. బిజెపి ఈ పర్యాయం ప్రజ్ఞా సింగ్‌ను కాదని భోపాల్ స్థానానికి అలోక్ శర్మను అభ్యర్థిగా ఎంపిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News