Sunday, November 17, 2024

మోడీ సోదరుడి ధర్నా

- Advertisement -
- Advertisement -

 

Prahalad Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ధర్మా చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాచేశారు. అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘానికి ప్రహ్లాద్ మోడీ ఉపాధ్యక్షుడు. తమ సంఘం డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన ధర్నా చేపట్టారు. జీవన వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో రేషన్ దుకాణాలను నడపడం చాలా కష్టంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బియ్యం, గోధుమలు, పంచదారపై తమకు ఇచ్చే కమిషన్ లో కేంద్ర ప్రభుత్వం కేజీపై కేవలం 20 పైసలు మాత్రమే పెంచడం దారుణమని అన్నారు. రేషన్ డీలర్లను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని,  సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ తరహా రేషన్ మోడల్ ను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డీలర్ల సంఘం నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. రేపు ప్రధాని మోడీని కలిసి వినతిపత్రాన్ని అందజేస్తామని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News