Thursday, November 14, 2024

బల్లెం వీరుడు నీరజ్‌పై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

బుడాపెస్ట్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్‌లోనూ స్వర్ణం సాధించి అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన హోరాహోరీ ఫైనల్లో నీరజ్ చారిత్రక ప్రదర్శనతో స్వర్ణం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పసిడితో చరిత్ర సృష్టించిన నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, గంగూలీ, గంభీర్, హర్భజన్, సెహ్వాగ్ తదితరులు నీరజ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు వీరంతా ట్విటర్ వేదికగా నీరజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అభిమానులు కూడా నీరజ్ చారిత్రక ప్రదర్శనకు ఫిదా అయ్యారు. భారత్‌కు లభించిన అత్యుత్తమ క్రీడాకారుల్లో నీరజ్ ఒకడని, అతను సాధించిన విజయాలు దేశ క్రీడా చరిత్రలోనే చిరకాలం తీపిజ్ఞాపకంగా మిగిలిపోతాయని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News