Saturday, January 4, 2025

నేడు హాలియా, పాలకుర్తి, ఇబ్రహీంపట్నంలో ప్రజా ఆశీర్వాద సభలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిఎం కెసిఆర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ నియోజకవర్గం హాలియాలో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. నాగార్జున సాగర్‌ నుంచి  బిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌  రెండో సారి పోటీ చేస్తున్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజవర్గం తొర్రూరులో ప్రజా ఆశీర్వాద సభలో మధ్యాహ్నం 2 గంటలకు పాల్గొననున్నారు. అనంతరం అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొననున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన కంటే బిఆర్ఎస్ పార్టీ పాలన బాగుందని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News