Monday, January 20, 2025

మూడోసారి కెసిఆర్ ను ముఖ్యమంత్రిని చేద్దాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బెల్లంపల్లిటౌన్: మనందరి లక్ష్యం కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పరిశ్రమల మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణను మరిపిస్తామన్నారు. ఐటీ రంగంలోనే ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, బెల్లంపల్లిలో 47వేల మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, 350 ఎకరాల్లో ఆహార శుద్ది కేంద్రంలో 27 కంపెనీలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 20 వేల కోట్లతో రోడ్లకు భూమి పూజ చేసుకున్నామని, త్వరలోనే బెల్లంపల్లి నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు.

గతంలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, 44కోట్లతో మిషన్ భగీరథను ప్రారంభించామని, నియోజకవర్గంలో 6కోట్లతో సీసీ రోడ్ల పనులు చేయడం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి పట్టణంలో నిరుపేదలకు ఏడు వేల మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా ఇక్కడ పట్టాలు పంపిణీ చేశామన్నారు. ప్రజల ఆదారాభిమానాలు మన నాయకులపై ఉండాలన్నారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రంలో పలు కేంద్రాల శిలాఫలకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్‌అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, ఎంపీ వెంకటేష్‌నేత, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రవీణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News