Sunday, January 19, 2025

వరంగల్‌లో విజయోత్సవ సంబురం

- Advertisement -
- Advertisement -

19న సిఎం పర్యటన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు అధికారులకు శాంతికుమారి ఆదేశం పక్కగా పార్కింగ్ ఏర్పాట్లు: మంత్రి కొండా సురేఖ

మన తెలంగాణ/హైదరాబాద్/హన్మకొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. రాష్ట్రంలో ప్రభు త్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పథకాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆర్ట్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జిలతో సంభాషించడంతోపాటు ఆస్తుల పంపిణీ కూడా చేస్తారు.

వరంగల్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించేందుకు సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమం త్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి శాంతికుమారితో కలిసి రూట్ మ్యాప్, డయాస్ ఏర్పాట్లు, పార్కింగ్ తదితర లాజిస్టిక్ అంశాలపై అధికారులతో చర్చించారు. మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను కోరా రు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మ హిళలు, పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను ప్రదర్శించాలన్నారు.19న వరంగల్‌లో నిర్వహించే కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని కోరారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ అండ్ బి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఐ అండ్ పిఆర్ హరీష్, వరంగల్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News