Sunday, December 22, 2024

తొలి జాబితా ప్రకటించిన ప్రజా శాంతి పార్టీ

- Advertisement -
- Advertisement -

12 మంది అభ్యర్థులను ప్రకటించిన కెఏ పాల్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. 12మంది అ-భ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆపార్టీ అధ్యక్షులు కె.ఏ. పాల్ విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మంగళవారం రెండో జాబితా విడుదల చేస్తామన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
బరిలోకి దిగుతున్న అభ్యర్థులు వీళ్లే..

చెన్నూరు: మొయ్య రాంబాబు
జుక్కల్ (ఎస్సీ): కర్రోల్ల మోహన్
రామగుండం: బంగారు కనకరాజు
వేములవాడ: అజ్మీరా రామేశ్ బాబు
నర్సాపురం : సిరిపురం బాబు
జహీరాబాద్: బేగరి దశరథ్
గజ్వేల్: పాండు
ఉప్పల్ : కందూరు అనిల్ కుమార్
యాకుత్‌పురా:  సిల్లివేరు నరేశ్
కల్వకుర్తి: కట్టా జంగయ్య
నకిరేకల్:  కదిర కిరణ్ కుమార్
మధిర : కొప్పుల శ్రీనివాస్ రావు

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News