Sunday, December 22, 2024

‘అభయహస్తం’ ధరఖాస్తుల సంఖ్య @ 1.25 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ‘అభయహస్తం’ కింద దరఖాస్తులను ప్రభుత్వం ప్రజల నుంచి స్వీకరించింది. శనివారంతో ప్రజాపాలన దరఖాస్తుల సమయం ముగిసింది. చివరి రోజు 16,90,278 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. జనవరి 17 వరకు ఈ డెటాను ఆన్‌లైన్ లో ఆప్‌లోడ్ చేయాలని అధికారులకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. జిల్లా కేంద్రంలో మండల అధికారులు, జిల్లా అధికారులు ఆధ్వర్యంలో పూర్తి డేటాను ఎంట్రీ చేస్తారు.

ప్రజాపాలన దరఖాస్తులు డిసెంబర్ 28 నుంచి ప్రారంభంకాగా జనవరి 6న ముగిసింది. రైతుబంధు, ఫెన్షన్లు తీసుకున్నవారు కొత్త దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆరు గ్యారంటీలలో గ్యాస్ సిలిండర్ రూ.500, ప్రతి మహిళకు 2500 ఆర్థిక బరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వృద్ధులకు రూ.4000 పెన్షన్, రైతు బరోసా కింద సంవత్సరానికి ఎకరానికి రూ. 15000, కూలీలకు సంవత్సరానికి రూ.12000 ఇస్తామని ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ పథకాన్ని మొత్తం పది లక్షల రూపాయలకు పెంచింది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కుల దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. వచ్చిన దరఖాస్తుల్లో 15 శాతం అభయహస్తం గ్యారంటీలకు సంబంధం లేనివని, రేషన్ కార్డులు భూసమస్యలపై ఉన్నాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News