Friday, November 22, 2024

అభయ హస్తం దరఖాస్తు అక్కడ ఉచితం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో గురువారం 28-12-2023 నుంచి ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న పథకాలకు సంబంధించి అబ్ధిదారుల నుంచి అభయ హస్తం పేరిట ఆరు గ్యారంటీల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తులను రాష్ట్రవ్యాప్తంగా ఆయా వార్డులు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల, ప్రజాపాలన గ్రామసభల్లో ఉచితంగా ఇస్తున్నారని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

దరఖాస్తులకు ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదని చెబుతున్నారు. ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం కావడంతో ఈ సేవ సెంటర్లు, పంచాయతీ ఆఫీసుల వద్ద జనాలు భారీగా క్యూ కట్టారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరూ దరఖాస్తును 30 నుంచి 50 రూపాయాలకు అమ్ముకుంటున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో స్పందించిన అధికారులు ప్రభుత్వం దరఖాస్తులను ఉచితంగా ఇస్తోందని, ఎవరూ డబ్బులు ఇవ్వకూడదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News