Monday, December 23, 2024

ఎలాంటి పైరవీలకు అవకాశం లేదు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ సిఎంటిసిలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులతో సమాచారం తీసుకోవాలని, ప్రజల వద్దకే పాలన పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందని, ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, స్థానిక ఎంఎల్‌ఎ దానం నాగేందర్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News