- Advertisement -
హైదరాబాద్: మంగళవారం నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. రెండు రోజుల విరామం తరువాత మళ్లీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 6 వరకు గ్రామ, వార్డుల్లో గ్రామ సభలు కొనసాగనున్నాయి. ప్రజాపాలనలో ఇప్పటివరకు 40.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పింఛన్లు, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులపై ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ఇప్పటికే పింఛన్లు, రైతుబంధు వస్తున్నవారు మళ్లీ దరఖాస్తు వద్దని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా అవసరమైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
- Advertisement -