Sunday, April 6, 2025

ప్రజావాణికి పోటెత్తిన జనం….(వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్ వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రజాభవన్ నుంచి దాదాపుగా కిలో మీటరు మేర ప్రజలు క్యూలో నిలిచి ఉన్నారు. తాము పడిన కష్టాలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రజలు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటిరోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్‌లో గత శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభించారు. ప్రజదర్బార్  పేరును ప్రజావాణిగా మార్చారు. వారానికి రెండు రోజుల మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News