- ఆర్డీఓ కె.సత్యపాల్ రెడ్డి
ములుగు జిల్లా ప్రతినిధి: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీఓ కె. సత్యపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి ప్రజావాణి కార్యాక్రమం నిర్వహించి, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం 41 దరఖాస్తులు రాగా అందులో 22 రెవెన్యూ, 4 పెన్షన్, 15 ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయని అన్నారు. వచ్చిన దరఖాస్తులలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించడం జరిగిందని తెలిపారు.
అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అల్లెం అప్పయ్య, చీఫ్ ప్లానింగ్ అధికారి ప్రకాష్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి తుల రవి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కుమార్, జిల్లా మత్యశాఖ అధికారి శ్రీపతి, డిసిఓ సర్దార్ సింగ్, డిసిఎస్‌ఓ అరవింద్ రెడ్డి, డిఎండిసిఎస్‌ఓ రాములు, డిటిడిఓ దేశీరాం, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.