Thursday, January 23, 2025

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్‌లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో 72 అర్జీలు రాగా, రెవెన్యూ సంబంధిత 39, మిగతావి 33 అర్జీలను ఉన్నాయని తెలిపారు. కాగా మండలంలోని కాసులపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ తమకు గృహ లక్ష్మీ పథకం కింద ఇండ్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ ఈ విభాగం సూపరింటెండ్‌కు రాస్తూ విచారణ చేసి అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

అలాగే శ్రీరాంపూర్ మండలానికి చెందిన నూనెటి వెంకశం శ్రీరాంపూర్ ప్రైవేటు పాఠశాలలో ఇష్టానుసారంగా దోపిడి జరుగుతుందని, పాఠ్య పుస్తకాలు ధరలు పెంచడమే కాకుండా నోటుబుక్కులను సైతం చెప్పిన చోట కొనాలని, కావేరి బుక్ స్టాల్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరకాస్తు చేయగా, జిల్లా విద్యాశాఖ అధికారికి రాస్తూ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News