Sunday, January 5, 2025

ప్రజావాణి దరఖాస్తులను మూడు రోజుల్లోగా పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారులనుండి వచ్చే సమస్యలను మూడు రోజుల్లో ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పలువురు బాధితులు ఆయా సమస్యలపై జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా అదనపు కలెక్టర్లు ప్రియాంక, శ్యాం ప్రసాద్ లాల్‌లకు వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి ప్రజల ఇచ్చిన అర్జిలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. మరోసారి ప్రజావాణికి దరఖాస్తు దారులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, టీ కప్పు, మిగిలిన ప్లాస్టిక్ వస్తువులను అధికారులు వాడకూడదని తెలిపారు.

జిల్లాలో భారీ వర్షాలు నమోదైన ప్రాంతాల్లో మండల ప్రత్యేక అధికారులు పర్యటించి డ్రైనేజీ ప్రవాహాల్లో ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే హరితహారం లక్షాలపై శ్రద్ద వహించాలన్నారు. వచ్చే వారం హరితహారంపై రివ్యూ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. కమాన్‌పూర్ మండలానికి చెందిన లక్ష్మీ తన భర్త పక్షవాతంతో 13 ఏళ్లుగా మంచానికి పరిమితమయ్యాడని, ప్రభుత్వం నుంచి దళితబందు పథకం ఇప్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి రాస్తూ విచారించి అర్హత మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News