Monday, December 23, 2024

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదిదారుల నుంచి అదనపు కలెక్టర్ రమేష్‌తో కలిసి 41 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి 41 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వాటిలో ఉపాది అవకాశాలు, పించన్లు, వివిధ రకాల రెవెన్యూ సమస్యల ఫిర్యాదులను సంబందిత అధికారులు పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News