Wednesday, January 22, 2025

సత్వర సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారుల నుండి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు.

దరఖాస్తులతో అర్జీదారులు విన్నవించే సమస్యలను గురించి అధికారులు తెలుసుకుంటూ, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులనున కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 62 దరఖాస్తులను స్వీకరించగా అందులో తహశీల్దార్ 22, ఆర్డిఓ సూర్యాపేట 7, డిఆర్‌డిఓ 4, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ సురేష్, డిఆర్‌ఎ రాజేంద్ర కుమార్, కోదాడ ఆర్డిఓ కిషోర్‌కుమార్, ఏఓ శ్రీదేవి, వివిధ శాఖల అధికారలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News