Thursday, January 23, 2025

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం ద్వారా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత కలెక్టరేట్ భవనంలో అధనపు కలెక్టర్ రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు దాసరి వేణు, శ్యామలాదేవిలతో కలిసి ఆర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

భీమిని మండలానికి చెందిన ముర్కి భీమయ్య వడాల గ్రామ శివారు నందు తమ తాతల నుండి సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇ ట్టి భూమికి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన రావి మనోహర్ చె న్నూరు మండలం నాగపూర్ శివారులో లక్ష్మి నారాయణ, రావి మనోహర్, రావి రాంమూర్తి పేరిట జాయింట్‌గా పట్టా ఉన్న భూమిని భూ ప్రక్షాలన సమయంలో ధరణిలో నమోదు చేసేటప్పుడు జాయింట్ పట్టాదారు అనుమతి లేకుండా ఒకరి పేరుపై పట్టా చేయడం జరిగిందని, ఇట్టి పట్టాను తిరిగి జాయింట్ పట్టాగా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

మందమర్రి మండలం ఊరు మందమర్రికి చెందిన నాగు ల కార్తిక్ తన తాత పేరిట ఉన్న భూమిని ఇతరుల పేరిట పట్టా చేయడం జరిగిందని, ఇట్టి పట్టా రద్దు చేసి తన తాత భూమిని తన పేరిట పట్టా చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వాణి కార్యక్రమంలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని, శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పూర్తి వివరాలతో నివేధిక రూపొందించి అందించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News