సిరిసిల్ల : ప్రజావాణి నిర్వహించేది ప్రజల సమస్యల పరిష్కారం కోసమని అందువల్ల అధికారులు ప్రజలనుండి వచ్చిన ఫిర్యాదు లకు సత్వర పరిష్కారం చూపాలని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహిం చిన ప్రజావాణిలో ప్రజలనుండి ఆయన 49 ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు జిల్లా నలుమూలల నుంచి ఎంతో ఆశతో ప్రజావాణికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటారని అందువల్ల అధికారులు కూడా అంతే శ్ర ద్ధ చూపి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. అధికారులు తమ శాఖల వారిగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించి ప్రజలకు జవా బుదారిగా ఉండాలన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ప్రజావాణి నిర్వహిస్తున్నామని ప్రజలకు కూడా తమ సమస్యలు ప్రజావాణిలో అర్జీలిస్తే పరిష్కారమవుతాయనే నమ్మకాన్నికలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు ఖీమ్యా నాయక్, సత్యప్రసాద్ ఆర్‌డిఓలు శ్రీనివాసరావు, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్‌డేకు 34 ఫిర్యాదులు : ఎస్‌పి అఖిల్ మహజన్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం ఎస్‌పి అఖిల్ మహజన్ గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజలనుండి 34 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకే గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.