Wednesday, December 25, 2024

నూతన కలెక్టరేట్‌లో నేడు ప్రజావాణి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించినందున ఈ నెల 12 నుంచి ప్రజావాణి కార్యక్రమం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలు ఈ మార్పును గమనించాలని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News