Monday, January 20, 2025

ప్రజ్ణానందకు బెస్ట్ ర్యాంకు

- Advertisement -
- Advertisement -

టాప్ టెన్‌లోకి భారత యువ గ్రాండ్ మాస్టర్

న్యూఢిల్లీ : నార్వే చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తన హవా కొనసాగిస్తున్నాడు. శనివారం రాత్రి క్లాసికల్ చెస్ గేమ్‌లో ఐదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 2 ప్లేయర్ ఫాబియానో కరువానాను మట్టికరిపించాడు. ఈ విజయంతో, ప్రజ్ణానంద మాగ్నస్ కార్ల్‌సెన్, కరువానా వంటి అగ్రశ్రేణి గ్రాండ్ మాస్టర్లను ఓడించడంతో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడె) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి పది స్థానాల్లోకి దూసుకెళ్లినట్లైంది.

ప్రజ్ఞానానంద ఐదో రౌండ్ ఫాబియానో కరువానాను ఓడించి సంచలనం సృష్టించాడు, మూడో రౌండ్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్‌ను సయితం ఓడించాడు. ఇక అంతకుముందు జరిగిన స్పేర్‌బ్యాంక్ 1 నాలుగో రౌండ్‌లో ప్రజ్ణానంద అమెరికాకు చెందిన హికారు నకమురాపై ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్‌లో నకమురా ప్రజ్ఞానందకు అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన ఆటతీరులో విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News