Friday, November 22, 2024

ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రజ్వల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత మధ్య అతడిని విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. లోక్ సభ ఎన్నికలలో హాసన్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపిగా ఆయన పోటీ చేశారు. ప్రజ్వల్ పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన దేశం వదిలిపారిపోయిన విషయం తెలిసిందే.

ప్రజ్వల్ రేవణ్ణపై లుకవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసినట్లు కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌కు తిరిగి తీసుకురావడానికి ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటామని పేర్కొంది. లుకవుట్ నోటీసు గురించి పోర్టులు, విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మరో బాధితురాలు కూడా ముందుకు వచ్చి ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు హోం మంత్రి వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోటీసులు నమోదు చేశారని, ఈలోగా మరో బాధితురాలు కూడా ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆమె గురించి వివరాలు వెల్లడించలేనని హోంమంత్రి చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News