Monday, December 23, 2024

లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హాసన అశ్లీల వీడియో, కిడ్నాప్ కేసుల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో హాసన ఎంపీ, ప్రజ్వల్ రేవణ్ణను పోలీస్‌లు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ పైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించేందుకు పోలీస్‌లు ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేదు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ ఘటనలో భర్త రేవణ్ణతోపాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో ఆమెను విచారించేందుకు సిట్ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో పేర్కొన్నారు. నేడు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం సిట్ అధికారులు హొళెనరసీపుర లోని ఆమె నివాసానికి వెళ్లగా భవానీ అక్కడ కనిపించలేదు. ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో ఆమె ముందస్తుబెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News