Sunday, January 19, 2025

ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు

- Advertisement -
- Advertisement -

హాసన్ సెక్స్ కుంభకోణంపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఓ మహిళ హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రజ్వల్ వీడియో కాల్‌లో బెదిరించి తన దుస్తులు విప్పించాడని తెలిపింది. “ ఆయన మా అమ్మకు ఫోన్‌కాల్ చేసి వీడియో కాల్‌లో మాట్లాడాలని నన్ను బలవంతం చేసేవాడు. నా దుస్తులు విప్పాలని అడిగేవాడు. నేను అందుకు నిరాకరిస్తు నాకు, మా అమ్మకు హాని తలపెడతానని బెదిరించేవాడు.” అని ఆమె పోలీస్‌లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రజ్వల్, హెచ్‌డి రేవణ్ణ తన తల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపింది. తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించి, తనపై తన తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది.

తాము ఈ సంఘటనపై పోలీస్‌లకు ఫిర్యాదు చేయగానే, తన తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంది. తన నివాసంలో పనిచేసే మహిళలను ప్రజ్వల్ వేధింపులకు గురి చేశాడని తెలిపింది. ప్రజ్వల్ బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని, కేవలం ముగ్గురు మాత్రమే వారి దారుణాలను బయటపెట్టారని చెప్పింది. ఈ సంఘటన అనంతరం తమ భూమిని కూడా బలవంతంగా అమ్ముకోవలసి వచ్చిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హెచ్‌డీ రేవణ్ణను అదుపు లోకి తీసుకున్న పోలీస్‌లు మే 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు ప్రజ్వల్ ఈ సంఘటన వెలుగు లోకి వచ్చిన మొదట్లోనే దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News