Friday, December 20, 2024

మే 31న ‘సిట్’ ముందు హాజరుకాబోతున్న ప్రజ్వల్ రేవన్న

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: లైంగిక వేధింపు కేసులో ముద్దాయి అయిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఎక్కడ అరెస్టవుతానోనని భయపడి దేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. కాగా అతడు మే 31న ఉదయం 10 గంటలకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ముందు హాజరు కానున్నాడు. ప్రస్తుతం తాను డిప్రెషన్ లో ఉన్నానని, తన తాత, మాజీ ప్రధాని హెచ్.డి.దేవె గౌడకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని తెలిపాడు.

అతడు వీడియోలో మాట్లాడుతూ తన ఉనికి గురించి తెలిపాడు. తన మీద అనేక కారణాలతో కేసులు దాఖలు చేశారని, సిట్ ను కూడా ఏర్పాటు చేశారని, తాను లోక్ సభ ఎన్నికల తర్వాత తిరిగి దేశానికి వచ్చేది తెలుపుతానన్నాడు. తన విదేశీ పర్యటనలకు, కేసులకు సంబంధమే లేదన్నాడు. తన ట్రిప్ ముందుగానే నిర్ణయించుకున్నదని తెలిపాడు. సిట్ తనకు నోటీసు జారీ చేసిందని తెలిశాక తన అడ్వొకేట్ ద్వారా రెస్పాండ్ అయ్యానన్నాడు. తనపై కాంగ్రెస్ నాయకులు దాడి మొదలెట్టాక తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిపాడు.

తనపై రాహుల్ గాంధీ వదంతులు వ్యాపింపజేశాడన్నాడు. తన కెరీర్ నాశనం చేయడానికి ఓ రాజకీయ కుట్ర జరిగిందన్నాడు. దానిని తాను ఎదుర్కొంటానని కూడా చెప్పాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News