Sunday, January 19, 2025

పరిశీలనలో ప్రజ్వల్ పాస్‌పోర్టు రద్దు అభ్యర్థన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం పంపిన అభ్యర్థనను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఇఎ) పరిశీలిస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమేటిక్ పాస్‌పోర్టు రద్దు కోరుతూ కర్నాటక ప్రభుత్వం నుంచి ఎంఇఎకు ఒక లేఖ అందినట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ లేఖను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కాగా..డిప్లొమేటిక్ పాస్‌పోర్టుపై ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి ప్రయాణించారని, ఈ పర్యటనకు రాజకీయ అనుమతి కోరలేదని ఎంఇఎ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఈనెల మొదట్లో విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News