Monday, December 23, 2024

గొప్ప మానవతావాది ప్రకాశరావు

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : గొప్ప మానవతావాది కొలిపాక ప్రకాశరావు అని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల, దివగంత కొలిపాక ప్రకాశరావు శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిమినల్ లాయర్ కొలిపాక ప్రకాశరావు శతజయంతి సభ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.పద్మజ రాణి అధ్యక్షతన, కళాశాల మూట్ కోర్ట్ ప్రాంగణంలో ముఖ్యతిథిగా పాల్గొని నివాళులు అర్పించి న్యాయ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వేగవంతమైన టెక్నాలజీ మార్పుల ప్రపంచం లో అంటే వేగంగా క్రైమ్ పెరిగిందని అన్నారు.

క్రైమ్ తన బాట మార్చుకుంది. తదనుగుణంగా పరిశోధనలు జరగాలని, విలువల పెంపు తో క్రైమ్ తగ్గింపు సాధ్యం అన్నారు. న్యాయ విద్యార్థులు తమ వృత్తిని ఆసక్తి తో నిర్వహించి కలలను సాకారం చేసుకొని సమాజం పై బాధ్యత కలిగి ఉండాలని అన్నారు.అనంతరం కర్ణాటక రాష్ట్ర హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ జస్టిస్ డాక్టర్ భాస్కర రావు మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని, సీనియర్ సిటిజెన్ లను గౌరవించాలని, మానవ హక్కుల ప్రాధాన్యత పెరిగింది అన్నారు. హక్కుల పరిరక్షణ తో మానవ హక్కుల భద్రతా జరుగుతుందని అన్నారు.

మానవ హక్కుల కమిషన్ కు విస్తృత అధికారాలు ఉన్నాయని, ప్రతి కేసు కు పరిష్కారం దొరుకుతుందని, మానవ హక్కుల ఉల్లంగన తో ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారని, క్రైమ్ పెరిగిందని, క్రిమినల్ జస్టిస్ అసవసరం అని అన్నారు. పురాతన కాలం రామాయణ, మహాభారత కాలం నుంచి క్రిమినల్ జస్టిస్ ఉందని, వేదాలు మాత్రమే ప్రామాణికాలు అని, సామాన్య ప్రజలకు చాల న్యాయ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కార దీషగా అడుగులు న్యాయ విద్యార్థులు వేయాలని సూచించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని న్యాయ కళాశాల ల మధ్య మూట్ కోర్ట్ పోటి నిర్వహించినట్టు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ సీనియర్ న్యాయవాది వద్ది రాజు వెంకటేశ్వర్లు, వద్దిరాజు గణేష్, కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ ఎన్ సుదర్శన్, పద్మజ, వేదశ్రీ, సుజాత, ప్రభాకర్, ప్రసన్న, హరిప్రసాద్, విశ్రాంత ప్రోపేసర్లు విజయచంద్ర, సుధాకర్, దివంగత కొలిపాక ప్రకాశరావు, కుటుంబ సభ్యులు లక్ష్మీకాంతం, లీల, మంజుల, అరుణ్ జ్యోతి, స్నేహలత, రాధిక, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సౌవనీర్ ను అతిథులు ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News