Monday, December 23, 2024

తమ్ముడి కూతురిని పెంచుకున్నారు… ఆస్తి కోసం బాలిక గొంతు కోసి చంపేశారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తమ్ముడి కూతురిని పెంచుకునేందుకు తీసుకొచ్చి ఆస్తి తగాదాలు రావడంతో పెంచుకున్న కూతురును అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కుమ్మర వీధిలో పుచ్చకుమాల వెంకట రమణారెడ్డి, లక్ష్మీపధ్మావతి అనే దంపతులు నివసిస్తున్నారు. వెంకట రమణా రెడ్డి ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో తన తమ్ముడు వెంకట రంగారెడ్డి చిన్న కూతురు శాన్వి రెడ్డిని దత్తత తీసుకొని తొమ్మిది సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నారు. రమణారెడ్డి, రంగారెడ్డి మధ్య ఆస్తి తగాదాలు జరిగాయి.

శాన్విరెడ్డి తన తల్లిదండ్రులపై ఎక్కువ ప్రేమ చూపడంతో పాటు ఆస్తి మొత్తం పాపకే అవుతుందని పగ పెంచుకున్నారు. జూన్ 6న మధ్యాహ్నం సమయంలో శాన్వి రెడ్డి సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండగా దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి అనంతరం గొంతు కోసి హత్య చేశారు. తన కూతురుని ఫోన్ కోసం దొంగలు గొంతు కోశారని నమ్మపలుకుతూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక చనిపోయిందని చెప్పారు. రంగారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రమణా రెడ్డి, పద్మావతిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News