అమరావతి: పెళ్లి చేయడంలేదని తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కనకమ్మ దుర్గమ్మ కాలనీలో తండ్రి బాలభద్రాచారి, కుమారుడు గురునారాయణ నివసిస్తున్నారు. గత కొంత కాలంగా తనకు పెళ్లి చేయాలని తండ్రి పలుమార్లు కుమారుడు అడిగాడు. తండ్రి నుంచి సమాధానం రాకపోవడంతో తండ్రి గ్రామ శివారులోకి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను గొంతు కోశాడు. గ్రామస్థులు గమనించి వెంటనే అతడిని ఒంగోలులోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి