Tuesday, January 21, 2025

పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు ప్రకాశం శర్మ

- Advertisement -
- Advertisement -

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరాజు

మన తెలంగాణ/మోత్కూరు: కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు మోత్కూరు ప్రకాశం శర్మ అని, ప్రకాశం శర్మ స్ఫూర్తితో యువత ప్రభుత్వ విధానాలపై పోరాడాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు అన్నారు. సిపిఐ(ఎం) సీనియర్ నాయకుడు మోత్కూరు ప్రకాశం శర్మ 7వ వర్థంతి మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో గ్రామశాఖ కార్యదర్శి మాండ్ర చంద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం శర్మ ప్రజల పక్షాన నిలిచి ఈ ప్రాంతంలో మంచిపేరుతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

Also Read: రేవంత్ చరిత్ర హీనుడు: శ్రవణ్

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు మతోన్మాద భావజాలంతో జాతీయ సమైక్య వాదాన్ని విభజిస్తుందని, ప్రజల మధ్య మతచిచ్చు పెడుతూ దేశంలో అశాంతి సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని మాటూరి బాలరాజు ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ల కొమ్ము కాస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతుందని, జీఎస్టీ పేరుతో పన్నుల భారం, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ అణిచివేస్తుందన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా బీజేపీ అవేవీ పట్టించుకోకుండా ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతుందని, ప్రజలు బీజేపీ విధానాలను తిప్పికొట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలు, ధరలపై నిలదీయాలని మాటూరి బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మోత్కూరు నరహరిశర్మ, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, చింతల కృష్ణారెడ్డి, సిపిఐ నాయకులు పైళ్ల యాదిరెడ్డి, ఎం.తిరుపతి, సిపిఎం నాయకులు దడిపెల్లి ప్రభాకర్, పైళ్ల రాంరెడ్డి, పిట్టల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News