Tuesday, September 17, 2024

కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది: ప్రకాశ్ జవదేకర్

- Advertisement -
- Advertisement -

Prakash Javadekar

న్యూఢిల్లీ:ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉగ్రవాదంటూ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రచారం నిర్వహించిన జవదేకర్ తన సహచర బిజెపి నాయకులతో సమానంగా ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అండగా నిలబడిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారని జవదేకర్ చెప్పారు. దీనికి కారణాన్ని ఆయన వివరిస్తూ కేజ్రీవాల్ ఉగ్రవాది అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయని, తనను తాను అరాచకవాదినని(అనార్కిస్ట్) కేజ్రీవాల్ చెప్పుకుంటారని ఆయన చెప్పారు. అరాచకవాదికి, ఉగ్రవాదికి పెద్ద తేడా లేదని జవదేకర్ వివరించారు.

Prakash Javadekar says Kejriwal is a terrorist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News