Thursday, January 23, 2025

పాదరక్షలతో వేములవాడ గుర్భగుడిలోకి ప్రకాశ్ జవదేకర్..!?

- Advertisement -
- Advertisement -

పాదరక్షలతో వేములవాడ గుర్భగుడిలోకి ప్రకాశ్ జవదేకర్..!?
ఇదేనా హిందూత్వం అంటే? నెటిజన్ల విసుర్లు
వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన టిఎస్‌ఎండిసి చైర్మన్ క్రిశాంక్
హైదరాబాద్: బిజెపి జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ వేములవాడ గర్భగుడిలోకి తన పాదరక్షలతో వెళ్తున్న సమయంలో పాదరక్షలను తొలగించి, గర్భగుడిలోనికి వెళ్లాలని పూజారి జవదేకర్‌ని కోరారు. గర్భగుడి బయట పాదరక్షలు విడిచి జవదేకర్ లోనికి ప్రవేశిస్తున్న సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ మీడియాను సదరు దృశ్యాన్ని రికార్డింగ్ చేయకుండా అడ్డుకున్నారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలతో కూడిన వీడియోను టిఎస్‌ఎండిసి చైర్మన్ క్రిశాంక్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన ఒకరు ఇదేనా హిందూత్వం అంటే..? అని బిజెపిపై విమర్శల బాణాలను సంధించారు. దేశం కోసం, ధర్మ కోసం ఏమైనా చేస్తారంటూ ఇంకొకరు వ్యంగ బాణాలు వదిలారు. ఇదీ వాళ్ల భక్తి అంటూ? మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News