Sunday, January 5, 2025

కిచ్చా సుదీప్ ప్రకటపై ప్రకాష్ రాజ్ దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కన్నడ సినీనటుడు కచ్చాసుదీప్ తాను రాజకీయాల్లోకి రాకపోయినా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మద్దతుగా బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంసాగిస్తానని ప్రకటించడంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. ప్రకాష్‌రాజ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బెంగళూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు సుదీప్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలను తోసి పుచ్చారు.

“ఇది కర్ణాటకలో బీజేపి పూర్తిగా ఓడిపోతుందన్న నిస్పృహతో చేసిన తప్పుడు సమాచారంగా భావిస్తున్నాను, బీజేపీ ఉచ్చులో ఆయన పడడని అనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ నరేంద్రమోడీ ప్రభుత్వ లోపాలపై తరచుగా విమర్శిస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News