Friday, January 17, 2025

ప్రకాశ్‌రాజ్‌పై కెటిఆర్ ప్రశంసల జల్లు

- Advertisement -
- Advertisement -

Prakash Raj Adopted Village going great: KTR

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ అంజయ్యతో కలిసి గొప్ప పురోగతిని సాధించారని కెటిఆర్ కొనియాడారు. ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న గ్రామంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను మధుసూదన్‌రావు అనే వ్యక్తి కెటిఆర్‌కు ట్యాగ్ చేయగా ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం స్ఫూర్తితో 2015, సెప్టెంబర్‌లో షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత గ్రామాభివృద్ధికి ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్, దిమ్మెలను ఏర్పాటు చేశారు. చెట్లను పెంచి గ్రామంలోని వీధులన్నింటినీ ఆకుపచ్చగా తయారు చేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలను ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేశారు.

Prakash Raj Adopted Village going great: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News